CM Revanth: వైఎస్, చంద్రబాబు, కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 21 , 2024 | 03:30 PM
Telangana: ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బుధవారం సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్ (YSR), చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), కేసీఆర్ (BRS Chief KCR) హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో తయ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నామన్నారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామన్నారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని.. ఇప్పుడది హైదరాబాద్‌కు లైఫ్ లైన్‌గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..