Share News

CM Revanth: వర్గీకరణపై సుప్రీం తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ఏమన్నారంటే?

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:22 PM

Telangana: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించారన్నారు.

CM Revanth: వర్గీకరణపై సుప్రీం తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ఏమన్నారంటే?
CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 1: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు (Supreme Court)తీర్పు నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించారన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని తెలిపారు.

Amrapali: గోప్యంగా సమాచారం.. వ్యక్తిగత వివరాలు అవసరం లేదు


తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు


సుప్రీం తీర్పు ఇదే..

కాగా... ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై గురువారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని తెలిపింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ఉన్నతన్యాయస్థానం స్పష్టంచేసింది. 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. 6:1తో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. గురువారం నాడు వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా.. ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా.. జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉందని.. వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజా తీర్పు తర్వాత ధర్మాసనం పక్కనబెట్టింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది.


ఇవి కూడా చదవండి...

TS News: ఇద్దరు మహిళలను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్ట్

KTR: నిండుసభలో మహిళల పట్ల వారి వ్యాఖ్యలు అత్యంత అవమానకరం...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 12:27 PM