CM Revanth Reddy:రాజ్ పాకాల ఫామ్‌హౌస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
ABN , Publish Date - Oct 29 , 2024 | 04:24 PM
రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతామని ఉద్ఘాటించారు. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల విందుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ(మంగళవారం) మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. ‘‘మాకు దీపావళి అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు’’ అని విమర్శించారు. దీపావళి దావత్ అలా చేస్తారని తమకు తెలియదని ఎద్దేవా చేశారు. ఏమీ చేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయారు? అని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారని నిలదీశారు. ఇంటి దావత్‌లో క్యాసినో కాయిన్స్, విదేశీమద్యం ఎందుకని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్...
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్ అని విమర్శించారు. వన్ ఇయర్‌లో కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేశానని... ఆ తర్వాత బావతో బామ్మర్దిని ఫినిష్ చేస్తానని అన్నారు. ఆ తర్వాత హరీష్‌రావును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని... కేటీఆర్ హరీష్ రావు కూడా తనతో కలిసి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
విద్యుత్ కొనుగోళ్లపై విచారణ..
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విచారణ విషయంలో కక్షసాధింపు ఉండదని తేల్చిచెప్పారు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని అన్నారు. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదని తేల్చిచెప్పారు. నవంబర్ 1వ తేదీన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు మొదలు పెడుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
మూసీ పునరుజ్జీవం పనులు ప్రారంభిస్తాం..
గండిపేట, హియాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు పనులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీరు తరలిస్తామని అన్నారు. 21 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవం పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నవంబర్‌లోపు మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల రోజుల్లో మూసీ ప్రాజెక్టు డిజైన్లు సిద్ధమవుతాయని చెప్పారు .బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తామని తెలిపారు. బాపూఘాట్ దగ్గర అభివృద్ధి కోసం ఆర్మీ స్థలం అడిగామని చెప్పారు.15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు వేస్తామని తెలిపారు. మూసీ వెంట అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్..రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Formula E Racing: తెలంగాణలో వెలుగులోకి మరో స్కామ్.. ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు
TG NEWS: నకిలీ పత్రాలతో ల్యాండ్ కబ్జా... పోలీసుల అదుపులో సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్
Babumohan: టీడీపీ గూటికి బాబుమోహన్
Bandi Sanjay: కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News