CM Revanth : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో రేవంత్ భేటీ
ABN , Publish Date - Jan 05 , 2024 | 06:20 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( 0Nirmala Sitharaman ) తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ), మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశం గంట పాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కేంద్ర నుంచి బీఆర్జీఎఫ్( బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్) కింద రావలసిన 1800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు.
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( 0Nirmala Sitharaman ) తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ), మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశం గంట పాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కేంద్ర నుంచి బీఆర్జీఎఫ్( బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్) కింద రావలసిన 1800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ తీసుకువచ్చారు. రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా..ఢిల్లీ పర్యటన ముగించుకొని మరి కాసేపట్లో హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరనున్నారు.