TG News: సీబీఐటీ కళాశాలలో ఉద్యోగుల ఆందోళన... కారణమిదే..?
ABN , Publish Date - Jun 08 , 2024 | 09:48 PM
భాగ్యనగరంలోని సీబీఐటీ కళాశాలలో (CBIT College) ఈరోజు (శనివారం) ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహిళా ప్రొఫెసర్‌ను ఐక్యూఏసీ డైరెక్టర్లు గత కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు.
హైదరాబాద్: భాగ్యనగరంలోని సీబీఐటీ కళాశాలలో (CBIT College) ఈరోజు (శనివారం) ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహిళా ప్రొఫెసర్‌ను ఐక్యూఏసీ డైరెక్టర్లు గత కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని యాజమాన్యం దృష్టికి మహిళా ప్రొఫెసర్ తీసుకువెళ్లారు. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని ప్రిన్సిపాల్ నరసింహులు కొట్టి పారేశారు.
మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలంటూ బోధన, భోదనేతరుల ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలంటూ ప్రిన్సిపల్ ఛాంబర్లో ఆందోళనకు దిగారు. బోధనేతర యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. సంజీవ్‌పై ప్రిన్సిపాల్ నర్సింలు ఎక్కి బయటికు వెళ్లిపోయారు . న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని బోధన, బోధనేతర సిబ్బంది యజామాన్యాన్ని హెచ్చరించారు.