Sampath: సీఎం రేవంత్ అమెరికా పర్యటనపై బీఆర్‌ఎస్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన సంపత్
ABN , Publish Date - Aug 08 , 2024 | 02:11 PM
Telangana: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, క్రిశాంక్ చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తిప్పి కొట్టారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘బాల్క సుమన్, క్రిశాంక్‌లు కేటీఆర్‌కు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్‌కు సుమన్, కృషాంక్ మధ్య చెడినట్లుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావాలని కేటీఆర్ కోరుకున్నారని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 8: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమెరికా పర్యటనపై బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, క్రిశాంక్ చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ (AICC Secretary Sampath Kumar) తిప్పి కొట్టారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘బాల్క సుమన్, క్రిశాంక్‌లు కేటీఆర్‌కు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్‌కు సుమన్, క్రిశాంక్ మధ్య చెడినట్లుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావాలని కేటీఆర్ కోరుకున్నారని తెలిపారు. ఓడిపోయిన నైరాశ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని మండిపడ్డారు.
Jayesh Ranjan: తెలంగాణకు పెట్టుబడులు నిజమే
తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారన్నారు. పెట్టుబడుల కోసమే సీఎం, మంత్రులు అమెరికా వెళ్లారన్నారు. ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన కుటుంబంపై కొందరు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ జరిగేటప్పుడు కాంగ్రెస్ ఇంచార్జ్‌గా తిరుపతి రెడ్డి అధ్యక్షత వహించారని తెలిపారు. కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ అధికారిక పర్యటన కాదని స్పష్టం చేశారు. ఇంకో సోదరుడుకి అమెరికాలో స్వచ్ బయో కంపెనీ ఉందని... దానిద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెడితే తప్పేంటి? దాని మీద ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని నిలదీశారు.
CM Revanth Reddy: సాధించిన రేవంత్ రెడ్డి.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు..!
పది సంవత్సరాలలో కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణలో విస్తరించారన్నారు. రేవంత్ రెడ్డి ఎనిమిది నెలలలో కుటుంబాన్ని ఎక్కడ చూపించలేదని తెలిపారు. ‘‘శ్రీరాముడి కల్యాణానికి భద్రాచలం ఆయన మనుమడు తలంబ్రాలు తీసుకెళ్లిండు. కుటుంబ పాలన అంటే కేసీఆర్ ది. రేవంత్ రెడ్డిది కాదు. కావాలనే బట్ట కాల్చి మీద ఏస్తున్నారు. ప్రాంతం వారు మోసం చేస్తే అక్కడే బొంద పెట్టాలి, ప్రాంతీయేతరులు మోసం చేస్తే బయట బొంద పెట్టాలని కాళోజీ నారాయణ రావు చెప్పారు. అందుకే పది ఏండ్లు తెలంగాణను మోసం చేసిన కేసీఆర్‌ను ప్రజలు బొంద పెట్టారు. మరొకసారి బద్నాం చేయాలని చూస్తే మెమేంటో చూపిస్తాం’’ అంటూ సంపత్ కుమార్ హెచ్చరించారు.
బాల్కసుమన్ ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశారని.. అతని సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్‌లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గర వికారాబాద్ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. కొడంగల్‌లో తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంచుతుంటే తమ జెడ్పిటీస్ మహిపాల్ అడ్డుకున్నారని తెలిపారు. రేవంత్ మరో సోదరుడు కొండల్ రెడ్డికి ఏ హోదా ఉందని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ అమెరికా పర్యటనలో స్వచ్ బయోతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని... ఆ కంపెనీ రేవంత్ మరో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డిది అని తెలిపారు. పదిహేను రోజుల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటయ్యిందని అన్నారు. ఇవే కాకుండా రేవంత్ సోదరుల ఆధ్వర్యంలో నాలుగు సంస్థలు ఏర్పాటు అయ్యాయన్నారు. ఈ సంస్థల ద్వారానే రేవంత్ బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రధాన కంపెనిలే కాకుండా రేవంత్ సోదరులు అనేక మైక్రో సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. రేవంత్ సోదరులు రియల్టర్లను బెదిరించి విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
RJ Shekhar: జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు
Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్‌ను అభినందించిన లోక్‌సభ స్పీకర్
Read Latest Telangana News And Telugu News