Share News

Cyberabad Police: పర్మిషన్ల కోసం పోలీస్ బాస్‌ల కొత్త వెబ్‌సైబ్.. వివరాలు ఇవే..

ABN , Publish Date - Oct 11 , 2024 | 07:33 PM

పోలీస్ పరిష్మన్ల కోసం ఆన్‌లైన్ ద్వారా అనుమతి ఇచ్చే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. అనుమతులు పొందే పద్ధతిని సులభతరం చేసినట్లు ఆయన చెప్పారు.

Cyberabad Police: పర్మిషన్ల కోసం పోలీస్ బాస్‌ల కొత్త వెబ్‌సైబ్.. వివరాలు ఇవే..

హైదరాబాద్: పోలీస్ పరిష్మన్ల కోసం ఆన్‌లైన్ ద్వారా అనుమతి ఇచ్చే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. అనుమతులు పొందే పద్ధతిని సులభతరం చేసినట్లు ఆయన చెప్పారు. ఇకపై పరిషన్లు పొందేందుకు ప్రజలు నేరుగా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా కొన్ని అనుమతులు ఇస్తున్నామని, త్వరలోనే పూర్తిగా పరిషన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.


ఈ సందర్భంగా సీపీ అవినాశ్ మాట్లాడుతూ.." పోలీసులు కొన్ని కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిటికీ ఆన్ లైన్ ద్వారా అనుమతి ఇచ్చే సైబరాబాద్ పోలీస్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టాం. దీని ద్వారా ప్రస్తుతం కొన్ని సర్వీసెస్ మాత్రమే అనుమతి ఇస్తున్నాం. అన్ని కార్యక్రమాలకూ పర్మిషన్లను ఇచ్చేలా త్వరలోనే దీన్ని సిద్ధం చేస్తాం. ఈవెంట్స్, బ్లాస్టింగ్ ఎన్వోసీకి సంబంధించిన అనుమతులను మాత్రమే ప్రస్తుతం ఇస్తున్నాం. ఇకపై ప్రజలు భౌతికంగా స్టేషన్‌కు వచ్చి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ సిస్టమ్ ద్వారా త్వరగా అనుమతులు లభించేందుకూ అవకాశం ఉంటుంది. అలాగే సమయం కూడా ఆదా అవుతుంది" అని చెప్పారు.


పోలీస్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సిన వారు ఆన్‌లైన్‌లో వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. వైబ్‌సైట్‌లో నేరుగా లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జోయల్ మాట్లాడుతూ.."అన్ని రకాల ఈవెంట్లకి సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. అనుమతుల కోసం ఇంతకు ముందు రకరకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆధార్ కార్డు వివరాలు సైబ్‌లో పొందుపరచాలి. స్థలం, పార్కింగ్ వివరాలు అనుమతి కోరేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఈవెంట్ సమయం కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఈవెంట్ సామర్థ్యం వివరాలు కూడా నమోదు చేయాలి.


ఆన్‌లైన్ ద్వారా ఎన్ని టికెట్లు విక్రయిస్తున్నారు, ఎంతమంది వస్తున్నారనే అంశాలనూ పొందుపరచాల్సి ఉంటుంది. సెలబ్రిటీలు, పెర్ఫామర్ల వివరాలనూ మెన్షన్ చేయాలి. లిక్కర్ సర్వీస్ ఉంటే ఎక్సైజ్ అనుమతులు జత చేయాలి. అనుమతి కోసం దరఖాస్తు చేసేటప్పుడు పార్కింగ్ లేఅవుట్ వివరాలు ఇవ్వాలి. సీసీ కెమెరాలు, ఫైర్, మెడికల్‌కు సంబంధించిన అంశాలనూ వైబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు చలాన కట్టి మాకు ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు నేరుగా వెబ్ సైట్‌లోనే నగదు చెల్లించే అవకాశం కల్పించాం. ఈవెంట్ రద్దు చేసుకోవడానికీ అవకాశం కల్పిస్తున్నాం. అనుమతి తీసుకున్న తర్వాత మధ్యలో ఈవెంట్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికీ అనుమతులు ఇస్తాం. పరిషన్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే విషయాలనూ ఇందులో చూసుకోవచ్చు" అని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Thummala: ప్రపంచంతో పోటీ పడేందుకే ఆ పాఠశాలలు: మంత్రి తుమ్మల..

Harish Rao: తెలంగాణ అంటే ఎందుకంత చిన్న చూపు.. కేంద్రానికి హరీశ్ రావు సూటి ప్రశ్న..

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి ముందు దానికి సమాధానం చెప్పాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Telangana: హీరో నాగార్జున, కొండ సురేఖ అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్

Updated Date - Oct 11 , 2024 | 07:34 PM