Share News

HYDRA: హైడ్రా యాక్షన్ షురూ.. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

ABN , Publish Date - Aug 31 , 2024 | 03:01 PM

Telangana: అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారిపై హైడ్రా బుల్డోజర్ దృష్టి సారించింది. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసిన హైడ్రా మొత్తం ఆరుగురు అధికారులపై కేసులు నమోదు అయ్యాయి.

HYDRA: హైడ్రా యాక్షన్ షురూ.. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు
Criminal cases against six officials

హైదరాబాద్‌, ఆగస్టు 31: అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా (HYDRA) దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారిపై హైడ్రా బుల్డోజర్ దృష్టి సారించింది. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసిన హైడ్రా మొత్తం ఆరుగురు అధికారులపై కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాదులో చెరువులు కట్టడాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Viral: వయనాడ్ విషాదం ముంగిట కదిలించే ప్రేమ కథ..!


హైదరాబాద్‌లో సిపి అవినాష్ మహంతి కేసులను నమోదు చేశారు. చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధామ్స్, బాచుపల్లి ఎంఆర్ఓ పై కేసు నమోదు అయ్యింది. మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజకుమార్‌పై, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫారసులతో ఆరుగురు అధికారులపై పోలీసులు కేసులు ఫైల్ చేశారు.

TPCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్ ఫిక్స్.. నేడే ప్రకటన!



మరోవైపు.. మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డిపైన రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. మ్యాప్స్ కంపెనీ సుధాకర్ రెడ్డితో పాటు పలువురుపై అధికారులు కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సు మేరకు కేసులు నమోదు అయ్యాయి. ఎర్రగుంట చెరువులో ఆక్రమణలు చేసి బహుల అంత భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్థుల భవనలు నిర్మించిన ముగ్గురిపై బిల్డర్స్‌పై కేసులు నమోదు అయ్యాయి. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు బిల్డర్స్ ఈర్ల చెరువులో అక్రమంగా బహుళ అంతస్తులు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad Pubs: అర్ధరాత్రి పబ్బులు, బార్‌లల్లో దాడులు.. డ్రగ్ టెస్ట్ చేయగా..

TPCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్ ఫిక్స్.. నేడే ప్రకటన!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 31 , 2024 | 03:07 PM