Share News

Crime News: స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం..

ABN , Publish Date - Jul 23 , 2024 | 07:49 PM

పటాన్‌చెరులో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం జరిగింది. ఓ మహిళ మాటలు నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

Crime News: స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం..

హైదరాబాద్: పటాన్‌చెరులో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం జరిగింది. ఓ మహిళ మాటలు నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.


పటాన్‌చెరు ఏపీఆర్ గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీలో బెజవాడ నాగార్జున అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. నాడియ కామి అనే మహిళ నుంచి అతనికి ఒక రోజు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెడితే బాగా సంపాదించవచ్చని నమ్మించింది. అతను నగదు పెట్టేలా పోత్సహించింది. దీంతో ఆశపడిన బాధితుడు ఒక్కసారిగా రూ.99,78,526.70(సుమారు కోటి రూపాయలు) వారు చెప్పిన అకౌంట్లలో వేశారు. అనంతరం ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు నాగార్జున.. పటాన్ చెరు పోలీసులను సంప్రదించారు.


తక్షణమే స్పందించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం వివిధ ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లలోని రూ.34లక్షలు ఫ్రీజ్ చేశారు. మిగతా నగదు కోసం మరింత విచారణ చేస్తున్నారు. అయితే ఫోన్లకు అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్, కాల్స్‌కు స్పందించవద్దని పోలీసులు చెప్తున్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీటిపై ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు కల్పించామన్నారు. ఆన్ లైన్ మోసాలకు ఎవరైనా గురైతే సకాలంలో 1930కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 23 , 2024 | 07:49 PM