Share News

Sunitha rao: ‘కాంగ్రెస్ కోసం పని చేశాం.. మేమెందుకు పదవులు అడగొద్దు’

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:57 PM

Telangana: నామినేటెడ్ పదవుల్లో మహిళ రిజర్వేషన్‌‌పై ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించినట్లు మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంభ ఆదేశాలతో ఈ నెల 29న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Sunitha rao: ‘కాంగ్రెస్  కోసం పని చేశాం.. మేమెందుకు పదవులు అడగొద్దు’
Congress Leader Sunitha Rao

హైదారాబాద్, జూలై 26: నామినేటెడ్ పదవుల్లో మహిళ రిజర్వేషన్‌‌పై ఢిల్లీలో (Delhi) ధర్నా చేయాలని నిర్ణయించినట్లు మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తెలిపారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంభ ఆదేశాలతో ఈ నెల 29న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ గురించి ధర్నా చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. నామినేటెడ్ పోస్టులలో మహిళ కాంగ్రెస్ నుంచి ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదని అన్నారు.

Volunteer System: అసెంబ్లీ వేదికగా వలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా కీలక ప్రకటన


ఈసారి సీఎం రేవంత్ రెడ్డి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఆడిగామన్నారు. అపాయింట్మెంట్ ఇవ్వగానే మహిళల హక్కుల కోసం వాదన వినిపిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం మహిళ హక్కులను కాలరా దని మండిపడ్డారు. పెరిగిపోతున్న ధరలు,చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇండియా కూటమి గెలిస్తే మహిళలకు పెద్ద పీట వేసే వారన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఆరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.

Revanth Reddy: నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్.. మరో 30 వేల పోస్టుల భర్తీ


ఎనిమిదేండ్ల అమ్మాయి నుంచి 60 ఏండ్ల మహిళ వరకు రక్షణ లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆర్థిక భరోసా లేదని విమర్శించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళ కాంగ్రెస్‌కు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలను కలిసి పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. తమకు పదవులు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘‘పార్టీ కోసం పని చేశాం.. మేమెందుకు పదవులు అడగొద్దు’’ అని కాంగ్రెస్ నేత సునీతారావు ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

CM Chadrababu: దమ్ముంటే అసెంబ్లీకి రా.. జగన్‌కు చంద్రబాబు సవాల్

Jupalli: అది గ్యాస్, ట్రాష్ కాదా?.. కేసీఆర్‌కు మంత్రి జూపల్లి సూటి ప్రశ్న

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 05:02 PM