Share News

Group-1 Exam: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:20 AM

Telangana: గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై విచారణకు రాగా.. గ్రూప్‌ 1‌ ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

Group-1 Exam: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్
Dismissal of Group 1 Prelims Petitions by High Court

హైదరాబాద్, అక్టోబర్ 15: గ్రూప్ -1 (Group - 1) మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో (Telangana High Court) అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు వచ్చింది. గ్రూప్‌ 1‌ ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

DSC 2024: టీచర్ పోస్టింగులు వాయిదా


గ్రూప్ 1లో తప్పుడు ప్రశ్నలను తొలగించాలని ఒక పిటిషన్ దాఖలవగా.. ప్రిలిమీనరీ కీ లో తప్పులు ఉన్నాయని, కీ ని రీ నోటిఫికేషన్ చేయాలని మరో పిటిషన్‌ను అభ్యర్థులు దాఖలు చేశారు. తప్పుడు ప్రశ్నలు తొలగించి మళ్లీ మెరిట్ జాబితాను విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. త్వరలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయని ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మెయిన్స్ విద్యార్థులు నష్టపోతారని టీజీపీఎస్‌సీ కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిటిషన్‌లను కొట్టివేసింది. దీంతో ఈనెల 21 నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి.


అందుబాటులోకి హాట్‌ టికెట్లు...

మరోవైపు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు ఈ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి 27వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్వహిస్తున్నారు. హాల్‌టికెట్లు పరీక్ష ప్రారంభమయ్యే ఒక రోజు ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. మెయిన్స్‌ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్ష హాల్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు అభ్యర్థులను అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. మెయిన్స్‌లో భాగంగా ప్రతి అభ్యర్థి ఆరు పేపర్లకు సంబంధించి పరీక్షలు రాయాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

Arrests: వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

TG News: అర్ధరాత్రి ఆటో ఎక్కిన యువతిపై దారుణం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 15 , 2024 | 11:34 AM