Share News

Drugs: డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఎక్కడంటే

ABN , Publish Date - Sep 19 , 2024 | 01:51 PM

Telangana: ఈజీ మనీ కోసం భవిష్యత్తును పణంగా పెట్టి డ్రగ్స్ అమ్మకాలు పాల్పడుతున్న ముగ్గురు యువకులు ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ 37లో ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు 30 ఎల్‌ఎస్‌డీ బ్లాడ్స్ డ్రగ్స్‌ను అమ్మకాలకు ప్రయత్నిస్తుండగా ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ శిరీష టీం సభ్యులు పట్టుకున్నారు.

Drugs: డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఎక్కడంటే
Engineering students caught supplying drugs

హైదరాబాద్, సెప్టెంబర్ 19: వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు (Engineering students). చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి సెటిల్ అవ్సాల్సిన వారు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. చదువుకుని ఆపై జాబ్ సంపాదించి డబ్బులు సంపాదించడం పెద్ద ప్రాసెస్ అనుకున్నారో ఏమో.. ఈజీ మనీ కోసం చెడు మార్గాన్ని ఎంచుకున్నారు ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు. చివరకు డబ్బు సంపాదించకపోగా పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

KTR: నాణ్యమైన వైద్యం అందించేందుకు ఫోక‌స్ చేశారా... లేదా


నగరంలోని మాదాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీ కోసం భవిష్యత్తును పణంగా పెట్టి డ్రగ్స్ (Drugs) అమ్మకాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులు ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ 37లో ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు 30 ఎల్‌ఎస్‌డీ బ్లాడ్స్ డ్రగ్స్‌ను అమ్మకాలకు ప్రయత్నిస్తుండగా ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ శిరీష టీం సభ్యులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

drugs-studenst.jpg

Sharmila: టీడీపీ, వైసీపీవి నీచ రాజకీయాలు: వైఎస్ షర్మిలా రెడ్డి


పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 70,000 విలువ ఉంటుంది. అరెస్ట్ అయిన వారిలో ఇంజనీరింగ్ చదువుతున్న చెన్నైకి చరణ్ తేజ్, తోటి విద్యార్థులు కౌశిక్ తూ బోటి, సయ్యద్ సర్ఫరాజ్‌లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. చెన్నై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులకు సప్లై చేస్తున్నటువంటి చెన్నైకి చెందిన సరఫరాజ్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. డ్రగ్స్ పట్టుకున్న శిరీష టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.


ఇవి కూడా చదవండి...

HYDRA: హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్‌‌సాగర్‌‌లో నిర్మాణాలేనా..

KTR: నాణ్యమైన వైద్యం అందించేందుకు ఫోక‌స్ చేశారా... లేదా

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 19 , 2024 | 01:56 PM