Telangana: కేసీఆర్‌తో మల్లారెడ్డి కీలక భేటీ.. పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారట..!
ABN , Publish Date - Mar 08 , 2024 | 04:15 PM
Hyderabad News: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) భేటీ అయ్యారు. వీరి భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు అంశం, మల్కాజిగిరి(Malkajgiri) టికెట్ కేటాయింపు, రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేత సహా పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
హైదరాబాద్, మార్చి 08: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) భేటీ అయ్యారు. వీరి భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు అంశం, మల్కాజిగిరి(Malkajgiri) టికెట్ కేటాయింపు, రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేత సహా పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. వాస్తవానికి గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతారని, కాంగ్రెస్‌లోకి(Congress) వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది. పార్టీ అధినేత కేసీఆర్.. మల్లారెడ్డికి కబురు పంపారు. దీంతో నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి మల్లారెడ్డి, ఆయన తనయుడు భద్రారెడ్డి వచ్చారు. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారడంపై ప్రధానంగా చర్చించారట. గురువారం నాడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అవడంపై చర్చించారు. అలాగే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేతపైనా కేసీఆర్ ఆరా తీశారు.
కాగా, తాను పార్టీ మారబోనని కేసీఆర్‌తో తేల్చి చెప్పారు మల్లారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, మీవెంటే నడుస్తానని కేసీఆర్ కు మల్లారెడ్డి స్పష్టం చేశారట. అలాగే తమ కుటుంబానికి మల్కాజిగిరి ఎంపీ సీటు వద్దని చెప్పారట. ఈ సీటును మెరెవరికైనా ఇవ్వాలని కేసీఆర్‌కు సూచించారట మల్లారెడ్డి. అయితే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరిగింది.