TG News:హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Aug 22 , 2024 | 08:37 AM
భాగ్యనగరంలో అగ్నిప్రమాదం జరిగింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఓ దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో అగ్నిప్రమాదం జరిగింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఓ దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారిని అక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. భవనం లోపల నుంచి పొగ కమ్ముకుంది. పొగ కారణంతో స్థానికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాభ్రాంతులకు గురవుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.
కుల్సుంపురలో రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేతక్‌పై తండ్రి, అతని కూతురు వెళ్తుండగా వెనకాల నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు. పురాణాపూల్ వైపు నుంచి జియాగూడ వెళ్తుండగా 100 ఫీట్ రోడ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చిన్నారి అనన్య మృతదేహం లభ్యం
నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం పక్కన గల్లంతైన చిన్నారి అనన్య మృతదేహం లభ్యం అయింది. సాయంత్రం కురిసిన వర్షానికి మురికి కాలువ పక్కన అనన్య ఆడుకుంటుండగా ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో వర్షపు నీటిలో రెండు సంవత్సరాల అనన్య కొట్టుకుపోయింది. రాత్రి నుంచి మున్సిపల్ సిబ్బంది ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి అనన్య మృతదేహం ఉదయం లభ్యమైంది.