Share News

Harish Rao: రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హరీష్‌ ఫైర్

ABN , Publish Date - Jul 04 , 2024 | 04:43 PM

Telangana: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమన్నారు.

Harish Rao: రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హరీష్‌ ఫైర్
Former Minister Harish Rao

హైదరాబాద్, జూలై 4: రాష్ట్రంలో రైతులు (Farmers) ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం (Congress Government) పట్టించుకోకపోవడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమన్నారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారన్నారు.

Telangana Politics: కన్ప్యూజన్‌లో కాంగ్రెస్.. మంత్రివర్గం విస్తరణ వాయిదా..!


రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని విమర్శలు గుప్పించారు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ (BRS) పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్‌రావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Congress: ఈనెల 10న తెలంగాణకు కురియన్ కమిటీ

MP Kesineni Sivanath: విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్రమంత్రి పచ్చజెండా..

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 04 , 2024 | 04:46 PM