Share News

Harish rao: రుణమాఫీపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం

ABN , Publish Date - Aug 20 , 2024 | 03:08 PM

Telangana: రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.31 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్టు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.

Harish rao: రుణమాఫీపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం
Former Minister Harish Rao

హైదరాబాద్, ఆగస్టు 20: రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.31 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్టు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister HarishRao) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రేమో రుణమాఫీ పూర్తి చేసినట్లు డబ్బా కొడుతున్నారని... మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదంటున్నరని అన్నారు.

Kolkata doctor Case: అన్నీ అబద్ధాలే.. సీబీఐ విచారణలో నోరు విప్పని మాజీ ప్రిన్సిపాల్..!


మొన్న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రూ.18వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటించారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తికాలేదని.. ఇంకా 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామన్నారని తెలిపారు. మరో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారన్నారు. ఇక ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే పచ్చి అబద్దం చెప్పారని అన్నారు. ఏకంగా 31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారని.. ఏది నిజం. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. ఒకవైపు రుణమాఫీ కాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారన్నారు.


భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ మీరు చెబుతున్నట్లు రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, కలెక్టరేట్ల చూట్టూ రైతులు ఎందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఎందుకు రోడ్లెక్కి రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ పూర్తి కాలేదన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి ఒప్పుకొని రైతులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 వరకు రైతులందరిని రుణవిముక్తులుగా చేస్తానన్న హామిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

Protests in Thane: స్కూల్లో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపులు


బీఆర్ఎస్ పాలనలో ఆదర్శ గ్రామంగా ఖ్యాతి గడించిన ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామం రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధ్వాన్నంగా మారిందన్నారు. గ్రామంలో ఉన్న మొత్తం 221 మంది రైతులకు గానూ, 49 మందికి మాత్రమే రుణమాఫీ చేసి మిగతా 172 మందిని మోసం చేసిందని మండిపడ్డారు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉన్నా, ముఖ్యమంత్రికి రైతుల ఆవేదన కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి రైతులందరికి రుణమాఫీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

Bandi Sanjay: వాటి నుంచి డైవర్ట్ చేయడానికే విగ్రహాల లొల్లి...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 03:19 PM