Peddi Sudarshan: రుణమాఫీపై వేల సంఖ్యలో కాల్స్, వాట్సప్ మెసేజెస్ వచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 07 , 2024 | 02:14 PM
Telangana: అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఫిర్యాదు చేయాలని ఫోన్ నెంబర్ ఇస్తే వేలాది ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 3 వేల 500 ఫోన్ కాల్స్ వచ్చాయని.. 40 వేలకు పైగా వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 7: అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఫిర్యాదు చేయాలని ఫోన్ నెంబర్ ఇస్తే వేలాది ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (MLA Peddi Sudarshna Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 3 వేల 500 ఫోన్ కాల్స్ వచ్చాయని.. 40 వేలకు పైగా వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆధార్ కార్డులో చిన్న తప్పులు ఉన్నాయని రైతు రుణమాఫీ కావడం లేదని ఫిర్యాదులు అందాయన్నారు. కొందరికి వీసా ఉందని రైతు రుణ మాఫీ తిరస్కరిస్తున్నారని తెలిపారు. కొన్ని తండాల్లో భూ రికార్డులు సరిగా లేవని రుణ మాఫీ చేయడం లేదన్నారు. కేవలం దేవుళ్ళ మీద ఒట్లు వేశానని రేవంత్ రెడ్డి తూతూ మంత్రంగా రుణ మాఫీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Olympics 2024: వినేశ్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ
రైతు పంట రుణాల ఆధారంగా అందరికీ రుణ మాఫీ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. రైతు భరోసా, బోనస్ డబ్బులు మిగుల్చుకుని ఆ డబ్బులను రుణ మాఫీకి కేటాయించారన్నారు. రైతు భరోసా సమీక్షకు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం విహార యాత్రలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ కాని రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతుందని తెలిపారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. సివిల్ సప్లై కుంభ కోణంపై త్వరలోనే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
Olympics 2024: ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫోగట్ ఔట్
కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేశారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతు రుణమాఫీకి నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా జులై 18న తొలి విడతగా లక్ష రూపాయలలోపు రుణాలున్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 11 లక్షల మంది రైతులకు రూ.6098 కోట్లు మాఫీ చేసింది. పన్నెండు రోజుల వ్యవధిలోనే రెండో విడతగా రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. రెండో విడతలో రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం.. రూ. 6,198 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతను అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. రైతు రుణమాఫీ చేయడంతో తమ జన్మ ధన్యమైందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు.
ఇవి కూడా చదవండి...
TS News: ప్రేమజంటలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డ్ అరెస్ట్
Rajasingh: చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ గురువు
Read Latest Telangana News And Telugu News