TG News: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ABN , Publish Date - Oct 25 , 2024 | 06:20 PM
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు విషయాలపై చర్చించింది. తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిల్ దాఖలైంది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. పార్టీ పర్సన్‌గా వాదనలను కేఏ పాల్ వినిపించారు. కేఏ పాల్ వాదనలు విన్న తర్వాత ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
తెలంగాణ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యాచారులపై హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. ఈ పిల్‌ను కూడా కేఏ పాల్ దాఖలు చేశారు. కేఏ పాల్ వాదనలను వినిపించారు. వాదనలు విన్న అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకు హైకోర్టు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేసింది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదన్నారు. పిటీషనర్ల తరఫు న్యాయవాదులు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జులై 3న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారని.. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Bandi Sanjay: ఇంతకంటే కాస్ట్‌లీ ప్రాజెక్టు.. కాస్ట్ లీ స్కామ్ ఎక్కడా లేదేమో
Kishan Reddy: రేవంత్ నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. అందుకు మేము సిద్ధమే
Read Latest Telangana News And Telugu News