Share News

Heavy Rain: భాగ్యనగరంలో భారీ వర్షం.... పలు ప్రాంతాలు జలమయం

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:42 PM

హైదరాబాద్‌లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.

Heavy Rain: భాగ్యనగరంలో భారీ వర్షం.... పలు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, LB నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, సంతోష్ నగర్, ఐస్ సదన్, ఉప్పల్, కాప్రా, మేడ్చల్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేటలో భారీ వర్షం పడుతోంది. ఫిలింనగర్‌లో భారీ వర్షం పడుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బల్దియా సూచించింది.. రాగల గంటపాటు నగరవ్యాప్తంగా భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.


వర్షం ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కరెంట్ సమస్య నెలకొంది. తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - Jun 17 , 2024 | 04:23 PM