Share News

Drugs: సికింద్రాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

ABN , Publish Date - Aug 26 , 2024 | 11:41 AM

Telangana: హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ నిర్మలనకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.

Drugs: సికింద్రాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం
Drugs

హైదరాబాద్, ఆగస్టు 26: హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ నిర్మలనకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. సికింద్రాబాద్ (Secundrabad) బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.8 కోట్ల విలువైన 8 కిలోల యాంఫెటమైన్ డ్రగ్‌తో (Drug)పాటు కారు మూడు సెల్ ఫోన్లనుు బోయిన్‌పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

CM Chandrababu: ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు


సుచిత్ర నుంచి ప్యారడైస్‌కు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న కారును వెంబడించి డైరీ ఫార్మ్ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన నాగరాజు, క్యాబ్ డ్రైవర్ వినోద్ కుమార్‌లు అరెస్టు చేశారు. దుందిగల్‌కు చెందిన శ్రీశైలం అక్కడి నుంచి పరారయ్యాడు. హైదరాబాద్ నగరానికి భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

TPCC: టీపీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్.. ఏ క్షణమైనా ప్రకటన..?


పేకాటరాయుళ్ల అరెస్ట్

మరోవైపు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో గత కొన్ని నెలలుగా భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్న పేకాటరాయులపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 12 మంది నిందితులను ఖాకీలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 12 సెల్ ఫోన్లతో పాటు.. రూ.1,90,000 నగదును స్వాధీనం చేసుకొని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పేకాట నిర్వహిస్తున్న నిర్వాహకులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. మరోవైపు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో గత కొన్ని నెలలుగా భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్న పేకాటరాయులపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 12 మంది నిందితులను ఖాకీలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 12 సెల్ ఫోన్లతో పాటు.. రూ.1,90,000 నగదును స్వాధీనం చేసుకొని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పేకాట నిర్వహిస్తున్న నిర్వాహకులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Telangana: తెలంగాణ మంత్రులపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Krishnashtami Whishes: రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, కేసీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2024 | 11:48 AM