Share News

Life Lesson: ఒకరి రహస్యాలు మరొకరికి చెప్పేవారి జీవితం ఎలా ఉంటుందంటే..!

ABN , Publish Date - Aug 26 , 2024 | 10:58 AM

జీవితంలో ఎదురయ్యే కష్టం, సుఖం, బాధ మొదలైనవన్నీ ఇలా సాన్నిహిత్యంగా ఉండేవారితోనే పంచుకుంటాము. అయితే సాన్నిహిత్యంగా ఉంటూ మోసం చేసేవారు కొందరు ఉంటారు.

Life Lesson: ఒకరి రహస్యాలు మరొకరికి చెప్పేవారి జీవితం ఎలా ఉంటుందంటే..!
Chanakya Niti

జీవితంలో కొంతమంది మాత్రమే మనతో సాన్నిహిత్యంగా ఉంటారు. ఇలా సాన్నిహిత్యంగా ఉండేవారినే ప్రతి ఒక్కరూ నమ్ముతారుయ. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే కష్టం, సుఖం, బాధ మొదలైనవన్నీ ఇలా సాన్నిహిత్యంగా ఉండేవారితోనే పంచుకుంటాము. అయితే సాన్నిహిత్యంగా ఉంటూ మోసం చేసేవారు కొందరు ఉంటారు. మనం ఎంతో నమ్మకంతో షేర్ చేసుకున్న విషయాలను రహస్యంగా ఉంచకుండా ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు జీవితంలో జరిగేదేంటో ఆచార్య చాణక్యుడు వివరించాడు.ఆ విషయం తెలుసుకుంటే..

తెలంగాణలో చాలామందికి తెలియని రహస్య టూరిస్ట్ ప్రాంతాలు ఇవి..!


ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తుడిని ఒక గొప్ప చక్రవర్తిగా మలచిన వాడు. ఈయన రాజనీతి శాస్త్రాన్ని, తత్వ శాస్త్రాన్ని సరిగ్గా గమనిస్తే నేటి కాలం ప్రజలు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. నమ్మకంగా ఉండి మన రహస్యాలు తెలుసుకుని ఆ తరువాత ఆ విషయాలను అందరికీ షేర్ చేసేవారిని ఆచార్య చాణక్యుడు పుట్టలో చిక్కుకున్న పాముతో పోల్చాడు.

పాము పుట్టలో నివసించినప్పటికీ అది అప్పుడప్పుడు బయటకు వస్తేనే దానికి ఆహారం, కాసింత గాలి లభిస్తాయి. అదే పాము బయటకు రాకుండా ఏ కారణం చేత అయినా పుట్టలోనే చిక్కుకుపోతే ఆ పాము ఉక్కిరిబిక్కిరి అయ్యి ఆ పుట్టలోనే మరణించి, నాశనమవుతుంది. తమ స్నేహితులను అవమానించాలనే ఉద్దేశ్యంతో అబద్దపు స్నేహాలు సాగిస్తూ వారి రహస్యాలను ఇతరులకు చెప్పేవారు ఏదో ఒక రోజు పాము పుట్టలో చిక్కుకుపోయి చీమలకే ఆహారం అయి నాశనం అయినట్టు, తను చేస్తున్న మోసంలో తనే చిక్కుకుని నాశనం అవుతాడట.

గుండె సమస్యల నుండి వేగంగా కోలుకోవాలంటే ఈ 7 టిప్స్ పాటించండి..!

అవిసె గింజలు తింటే ఆడవాళ్లకు ఎన్ని లాభాలంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 26 , 2024 | 10:58 AM