Share News

TG News: హైదరాబాద్‌లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్స్ పట్టివేత

ABN , Publish Date - Aug 12 , 2024 | 12:24 PM

Telangana: నగరంలోని హయత్‌నగర్‌లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్ పట్టుబడింది. డ్రగ్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి బెంగుళూరికి వయా హైదరాబాద్ మీదుగా హాష్ ఆయిల్‌ను ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

TG News: హైదరాబాద్‌లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్స్ పట్టివేత
Rachakonda CP Sudhirbabu

హైదరాబాద్, ఆగస్టు 12: నగరంలోని హయత్‌నగర్‌లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్ పట్టుబడింది. డ్రగ్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి బెంగుళూరికి వయా హైదరాబాద్ మీదుగా హాష్ ఆయిల్‌ను ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు కోటి రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. హషీష్ ఆయిల్ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాను పట్టుకున్నామన్నారు.

Doctors Strike: దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన డాక్టర్లు..కారణం ఇదే


హయత్‌నగర్ పోలీసులతో పాటు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ముఠాను పట్టుకున్నారని తెలిపారు. కొండబాబు, బాలకృష్ణ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 13.5 హాషిష్ ఆయిల్‌ను సీజ్ చేశామన్నారు. మొత్తం విలువ కోటి రూపాయల పైనే ఉంటుందన్నారు. 13.5 హాషిష్ తయారు చేయాలంటే 600 కేజీల గంజాయి ప్రాసెస్ చేయాలన్నారు. నిందితులు ఇద్దరు ఆంధ్రప్రదేశఅల్లూరు జిల్లాకు చెందినవారుగా గుర్తించామన్నారు. వ్యవసాయం చేస్తూ ఈజీ మనీ కోసం మాదకద్రవ్యాల సరఫరాను ఎంచుకున్నారని సీపీ తెలిపారు. హాష్ ఆయిల్‌ను ఒడిశాలో కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలిస్తున్నారన్నారు.

TG News: బౌద్ధ స్థూపాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం, మంత్రులు జూపల్లి, పొంగులేటి..


అన్నవరం సమీపంలో పశువుల మార్కెట్‌లో ఓ వ్యక్తి కొండబాబుకు పరిచయం అయ్యారని.. అతని ద్వారా కొండబాబు బాలకృష్ణ మాదక ద్రవ్యాల సరఫరాలోకి వచ్చారన్నారు. నిందితులు ఇద్దరు హాష్‌ ఆయిల్‌ను తక్కువ ధరకి కొనుగోలు చేసి బెంగళూరులో 10 రెట్లు అధిక లాభానికి అమ్ముతున్నారన్నారు. ఇటీవ‌ల బెంగ‌ళూరుకు చెందిన రిసీవ‌ర్ 14 కేజీల హాష్ ఆయిల్ ఆర్డర్ వచ్చిందని.. కొండబాబు, బాలకృష్ణ హాష్ ఆయిల్ కొనుగోలు చేసి బెంగళూరుకు చేరవేయడానికి ప్రయత్నించారన్నారు. చుండ్రుమామిడి కొండలు అనే ప్రాంతం నుండి నిందితులు ఈ హషిష్ ఆయిల్ తీసుకొచ్చారని తెలిపారు.నిందితులపై నిఘా పెట్టి పెద్ద అంబర్‌పేట వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాలకృష్ణపై గతంలో ఎన్‌డీపీఎస్ కేసులు ఉన్నాయన్నారు. బెంగళూరులో ఎవరికి హష్ ఆయిల్ చేరవేస్తున్నారని దర్యాప్తు చేస్తున్నామన్నారు. హైదరాబాదులో గంజాయి సప్లయిర్లతో నిందితులు ఇద్దరికీ సంబంధాలు ఉన్నాయని సీపీ రాచకొండ సుధీర్ బాబు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Rain Update: హైదరాబాద్‌లో కుండపోత వర్షం

Jupalli: పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2024 | 12:27 PM