Smita Sabharwal: హై కోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం
ABN , Publish Date - Aug 12 , 2024 | 12:32 PM
ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ట్విట్టర్(X)వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై వికలాంగులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ట్విట్టర్(X)వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై వికలాంగులు ఆందోళనకు దిగారు. తాజాగా స్మితా సబర్వాల్ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. దివ్యాంగులపై స్మిత సబర్వాల్ చేసిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర ఈ పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె తెలిపారు. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్‌కు ఉన్న అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ ఒక వికలాంగులారని అడ్వకేట్ తెలిపింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
స్మితా సబర్వాల్ ఏమన్నారంటే..
కాగా, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో పంచుకున్నా విషయం తెలిసిందే. ఈ చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా. #AIS ( IAS/ IPS/IFoS) అనేది ఫీల్డ్ వర్క్, పన్నులు విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్‌కు ఈ కోటా అవసరమా అని తన అభిప్రాయాలను స్మితా సబర్వాల్ వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు(netizens) తీవ్రంగా స్పందించారు. వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఈ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు.
వికలాంగుల ఆందోళన...
వికలాంగులను 'సంకుచిత దృక్పథం'తో చూడరాదని, వారి అర్హతపై ఇలా మాట్లాడటం సరికాదని స్మితా సబర్వాల్ వైఖరీపై మండిపడుతున్నారు. దీనిపై శ్రీకాంత్ మిర్యాల అనే రచయిత, సైకియార్టిస్ట్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ప్రత్యక్ష ఉదాహరణలతో గతంలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు తన ప్రిన్సిపాల్ కాలుకి పోలియో సోకి సరిగా నడవలేనివారు, అయినా కూడా ఎడమచేత్తో రాసి, పాఠాలు చెప్పారని గుర్తు చేశారు. ఇలా చాలా మంది దివ్యాంగులు పలు రంగాల్లో ఉన్నట్లు గుర్తు చేశారు.
గతంలోనూ స్మితపై వివాదాలు..
అలాగే, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు(officers) ఇలా ట్వీట్ చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. ‘మీ పని మీరు సరిగ్గా చేయండి చాలు. అంతేకానీ మీకు సలహాలు ఇచ్చే స్థాయి ఇంకా రాలేదని చెబుతున్నారు’ అని అన్నారు. అంతేకాదు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఈ అధికారిణిపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణల మధ్య ఈ వివాదం మొదలైంది. యూపీఎస్‌సీ పరీక్షలో తన అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం, ఇతర వెనుకబడిన తరగతి (నాన్-క్రీమీ లేయర్) కోటాను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.