IMD weather update: ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి.. ఐఎండీ హెచ్చరిక
ABN , Publish Date - May 12 , 2024 | 06:20 PM
తెలంగాణ వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో రానున్న 3రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు 4 జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రేపు భద్రాది కొత్తగూడం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో రానున్న 3రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు 4 జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రేపు భద్రాది కొత్తగూడం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.రేపు(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులాతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల తేలిక పాటి వర్షాలు పడచ్చని పేర్కొంది.
తెలంగాణలో వర్షాల ప్రభావంతో ఎల్లో అలర్ట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి వర్షాల పడతాయని చెప్పింది. రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 వరకు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నిజామాబాద్ 41, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 నుంచి 40 వరకు సగటు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో వీస్తాయని తెలిపింది.
CM Revanth: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు