Share News

TG NEWS: లగచర్ల ఘటనలో నిందితుడికి గుండెపోటు

ABN , Publish Date - Dec 12 , 2024 | 02:22 PM

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే జైల్లో ఉంటున్న నిందితుడికి గుండెపోటుకు గురయ్యాడు.

TG NEWS: లగచర్ల ఘటనలో నిందితుడికి గుండెపోటు

సంగారెడ్డి జిల్లా: కంది సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతు హీర్యా నాయక్‌కు నిన్న(బుధవారం) రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. హిర్యా నాయక్‌ను మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం..నేడు సంగారెడ్డి జనరల్ ఆస్పత్రికి జైలు అధికారులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ మాట్లాడారు. హిర్యనాయక్‌కి రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కంది జైల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు రాత్రే ఈసీజీ తీశాం నార్మల్ గా ఉందని అన్నారు. ఈరోజు ఉదయం మళ్లీ కొన్ని చెక్ అప్‌ల కోసం ఆస్పత్రికి రమ్మని చెప్పమన్నారు. ఉదయం కూడా 2డీ ఈకో, ఈసీజీతో పాటు మిగతా కొన్ని పరీక్షలు చేశామని..అన్ని నార్మల్‌గానే ఉన్నాయన్నారు. కార్డియాక్‌వలుషేన్ కోసం గాంధీకి రెఫర్ చేశామని..ప్రస్తుతం వీర్యనాయక్ స్టేబుల్ గానే ఉన్నారని చెప్పారు.. అయిన కూడా సేఫ్ సైడ్ కోసం, కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం గాంధీకి రిఫర్ చేశామని అన్నారు. ఇప్పటి వరకు తాము చేసిన ఈసీజీ,2డీ ఈకో టెస్టులో అన్ని నార్మల్ గానే ఉన్నాయని తెలిపారు.


కలెక్టర్‌‌పై దాడి ఎలా జరిగిందంటే..

కాగా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడి జరిగే సమయానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో పోన్ కాల్ చేసి సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి సైతం.. ఓ వైపు సురేశ్‌తో మాట్లాడుతూనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు డీజీపీ ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సురేశ్‌పై ఇప్పటికే అత్యాచారం కేసుతో సహా వివిధ కేసులు సైతం నమోదయ్యాయి. అయితే గతంలో సురేష్‌పై నమోదు అయిన కేసులను తొలగించేందుకు పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది.


పట్నం మహేందర్ రెడ్డికి రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామం ఘర్షణల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో పాటు.. మరికొందరి ఆదేశాలు కూడా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా ప్రజలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. అంతేకాదు.. కొందరికి డబ్బులు ఇచ్చి మరీ దాడికి ఉసిగొల్పారన్నారు. అధికారులను చంపినా పర్వాలేదని.. రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచరించామని పోలీసులు అన్నారు. నిందితుడు విశాల్‌‌తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిగా తేలిందని చెప్పారు.

Updated Date - Dec 12 , 2024 | 02:22 PM