Share News

Jaggareddy: పీసీసీ పదవిపై.. జగ్గారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్

ABN , Publish Date - Sep 07 , 2024 | 06:39 PM

టీపీసీసీ పదవిపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు (శనివారం) గాంధీభవన్‎లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... బీసీ నేతకు పీసీసీ ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్‎కు ఈ పదవీని ఏఐసీసీ ఇచ్చిందని తెలిపారు.

Jaggareddy: పీసీసీ పదవిపై.. జగ్గారెడ్డి మరోసారి  హాట్ కామెంట్స్
Jaggareddy

హైదరాబాద్: టీపీసీసీ పదవిపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు (శనివారం) గాంధీభవన్‎లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... బీసీ నేతకు పీసీసీ ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్‎కు ఈ పదవీని ఏఐసీసీ ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు.


చాలామంది నేతలు పీసీసీ పదవీ కోసం పోటీ పడ్డారని చెప్పారు. బీసీ కోణంలో మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్, లక్ష్మణ్ బరిలో ఉన్నారని తెలిపారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, శంకర్ పేర్లను పరిశీలించారని చెప్పారు. కానీ బీసీలకు ఈ పదవీ ఇవ్వాలనే ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్‎కు పీసీసీ పదవీని ఏఐసీసీ ఇచ్చిందని వివరించారు. తనతో నిన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‎గా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారని గుర్తుచేశారు. ఆయన అందర్నీ కలుపుకొని పోతారని భావిస్తున్నానని తెలిపారు.


పార్టీ లైన్‎లో మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారని అన్నారు. తాను కూడా పీసీసీ కావాలనుకున్నా.. ఎప్పటికైనా అవుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్ద పార్టీ అని.. ఈ పార్టీలో ఎవరైనా పీసీసీ కావచ్చని తెలిపారు. ఏఐసీసీ మాత్రం ఈసారి బీసీకి పీసీసీస ఇవ్వాలని భావించి ఇచ్చిందని గుర్తు చేశారు. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీసీకి పీసీసీ ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించిందని అన్నారు. బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పదవీ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీలో చాలా స్వేచ్ఛ ఉందని తెలిపారని అన్నారు.


బీజేపీ పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ కావాలన్నా కష్టమేనని చెప్పారు. ఎవరికీ అధ్యక్ష పదవీ వస్తుందో తెలీదని.... ఎప్పుడు అధ్యక్ష పదవీ నుచి తీసివేస్తారో తెలీదని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అయితే ప్రాంతీయ పార్టీ.. అందులో పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కదని ఆరోపణలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక కులానికి పరిమితం కాదని.. అందరినీ కలుపుకుని పోతారని చెప్పారు. బీసీ కమిషన్ నియామకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.


రైతుల పట్ల పూర్తి అవగాహన ఉన్న నేత కోదండరెడ్డికి రైతు కమిషన్ ఇచ్చారని గుర్తుచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అకునూరి మురళికి విద్య కమిషన్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం వరద బాధితులను ఆడుకుంటుందని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

Updated Date - Sep 07 , 2024 | 06:40 PM