Share News

Jupally Krishna Rao,: బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొట్టారు ... మంత్రి జూపల్లి ధ్వజం

ABN , Publish Date - Oct 21 , 2024 | 05:55 PM

గ్రూప్-1 పరీక్షల విషయంలో బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేశారని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పారు.

Jupally Krishna Rao,: బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొట్టారు ... మంత్రి జూపల్లి ధ్వజం

నిజామాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణపై చేసిన అప్పులకు నెలకు రూ. 6వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వడ్డీలు ఎంత భారం అయినప్పటికీ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తుందని స్పష్టం చేశారు. నూడ ఛైర్మన్ కేశ వేణు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ(సోమవారం) జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ...గ్రూప్-1 పరీక్షల విషయంలో బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేశారని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పారు. నిజామాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక మక్కువ ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.


కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది...

‘‘జిల్లాకు అత్యధికంగా కేటాయించిన నామినేటెడ్ పోస్టులే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు , సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవాలి. గడిచిన పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్వానంగా మార్చింది. కేసీఆర్ హయాంలో ఏ ఒక్క హామీ అమలు కాలేదు. కేసీఆర్ ఒక నియంతలా రాష్ట్రాన్ని పరిపాలించాడు కాబట్టే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను గెలిపించాలి’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.



ఈ వార్తలు కూడా చదవండి...

KTR: కాంగ్రెస్, బీజేపీ నేతలవి రహస్య ఒప్పందాలు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth: వాటిపై దాడి చేస్తే వదలిపెట్టం.. సీఎం మాస్ వార్నింగ్

Etela Rajender: అంతా చేసింది పోలీసులే.. ఎంపీ సంచలన ఆరోపణలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 21 , 2024 | 07:07 PM