Keshav Rao:ఎంపీ వెంకటేష్ అలా అనడంతో బాధపడ్డా.. కేశవరావు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 11 , 2024 | 08:50 PM
అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కేశవరావు(Keshav Rao) అన్నారు. రాముడిని ప్రధాని మోదీ రాజకీయం చేశారని మండిపడ్డారు.
ఢిల్లీ: అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కేశవరావు(Keshav Rao) అన్నారు. రాముడిని ప్రధాని మోదీ రాజకీయం చేశారని మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పక్కన పెట్టి అయోధ్య గురించి పార్లమెంట్‌లో చర్చ పెట్టి తీర్మానం చేశారన్నారు. అయోధ్య రామాలయంపై పార్లమెంట్‌లో తీర్మనం చేయడం తప్పని.. తాను ఈ విషయాన్ని వ్యతిరేకించానని.. కానీ సభాపతి అధికారం ఉంటుంది కాబట్టి అలా చేశారన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రామాలయాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. అయోధ్య గుడికి వెళ్లని వారు దేశ వ్యతిరేకులు కాదన్నారు.
అయోధ్య గుడి గురించి మోదీ మట్లాడుతున్నారని..యాదాద్రి తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కానీ మోదీ ఒక్కసారి కూడా యాదాద్రి గురించి మాట్లాడలేదన్నారు. తాను రావణుడి గుడికి వెళ్తున్నానని తెలిపారు. కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్‌కి వెంకటేష్ నేత రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిడంపై కేకే స్పందించారు. తమ అవసరాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నేతలు పార్టీ మారుతూ ఉంటారని తెలిపారు. వెంటేష్ నేత బీఆర్ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని ఆయన అనడంతో చాలా బాధపడ్డానని అన్నారు. అధికారంలో ఎవరు శాశ్వతం కాదని.. అధికారం మారుతూ ఉంటుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని కేశవరావు అన్నారు.