TG News: తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్.. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 28 , 2024 | 09:52 PM
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా 2026లో హైదరాబాద్‌లో ఈ గేమ్స్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా 2026లో హైదరాబాద్‌లో ఈ గేమ్స్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమస్యలను కేంద్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
బీఆర్ఎస్ ఎంపీల అటెండెన్స్ కూడా రాజ్యసభలో కనిపించడం లేదని విమర్శించారు.పదేళ్లలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రమంత్రులను కలిసిందిలేదని, పనులు తీసుకొచ్చింది లేదని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా తెలంగాణ ఎంపీలు మీడియా సమావేశంలో కీలక విషయాలు పంచుకున్నారు. తమ పనితీరును కేంద్రమంత్రులే మెచ్చుకుంటున్నారని అన్నారు.కేటీఆర్ భజన మండలి పదేళ్లలో బీఆర్ఎస్ కేంద్రం నుంచి ఏం తెచ్చిందో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. నిలదీసేది బీఆర్ఎస్ నేతలే అయితే ఇంతకాలం ఎందుకు సమస్యలు పెండింగ్‌లో ఉంటాయని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై విజ్ఞప్తి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెలరోజులకే కేంద్ర ప్రభుత్వానికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై విజ్ఞప్తి చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్రం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సారాంశం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో భాగమేనని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వచ్చి ఏ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన దాఖలాలు లేవు అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
వరంగల్ ప్రజల కళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ: ఎంపీ కడియం కావ్య
వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. వరంగల్ ప్రజల కళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అని. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ ప్రయత్నాలతో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాంక్షన్ అయిందని చెప్పారు. 2025 ఆగస్టు వరకు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని రైల్వే ఉన్నతాధికారులు చెప్పారని ఎంపీ కడియం కావ్య అన్నారు.
బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు తెలిపలేదా: ఎంపీ మల్లురవి
కేసీఆర్ నల్ల చట్టాలకు మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి గుర్తుచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు తెలిపలేదా అని ప్రశ్నించారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధానమంత్రిని రాజీనామా చేయాలని తాము పార్లమెంట్ కోరుతున్నామని అన్నారు. ప్రజలు ఐదేళ్లు అధికారం చేయమని మాత్రమే మద్దతు బీజేపీకి తెలిపారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢీల్లీ వెళ్తున్నారని విమర్శలు చేయడం సమంజసం కాదని తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్తున్నారని తెలిపారు.బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో కార్యాలయం ఎందుకు కట్టుకున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కి ఏ అవసరం ఉందని ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కట్టుకున్నారని ఎంపీ మల్లురవి నిలదీశారు.
బీజేపీ ఎంపీలను కలుపుకొని వెళ్తాం: ఎంపీ రఘురామ రామిరెడ్డి
తెలంగాణ సమస్యలపై బీజేపీ ఎంపీలను కలుపుకొని వెళ్తామని.. తప్పులేదని ఎంపీ రామసహయం రఘురామ రామి రెడ్డి తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలు అయ్యాక అభివృద్ధే తమ లక్ష్యం మని చెప్పారు. బీజేపీ అన్నదమ్ముళ్ల సహాయం ఖచ్చితంగా తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమకు సమస్యలేదని, రాష్ట్ర అవసరాల కోసం రమ్మని స్వయంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారని మసహయం ఎంపీ రఘురామ రామి రెడ్డి గుర్తుచేశారు.