Kidney Racket: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ కలకలం
ABN , Publish Date - Dec 13 , 2024 | 12:10 PM
కిడ్నీ రాకెట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కలకలం సృష్టిస్తోంది. కిడ్నీలు కావాల్సిన వారిని సైతం ఈ ముఠా మోసం చేస్తోంది.తాము మోసపోయమంటూ అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత్‌లో ఫిర్యాదు చేయాలని అమెరికా పోలీసులు చెప్పడంతో తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: కిడ్నీ మార్పిడి చేయిస్తామంటూ అమెరికాలో ఉన్న దంపతులకు మోసగాళ్లు టోకరా చేశారు. దంపతుల నుంచి రూ.80 లక్షలను కేటుగాళ్లు కొట్టేశారు. ఖాజాగూడాకు చెందిన దంపతులు రంగారెడ్డి సునీత అమెరికాలో ఉంటున్నారు. గత ఏడాది నుంచి కిడ్నీ సమస్యతో రంగారెడ్డి బాధపడుతున్నాడు. ఆపరేషన్ పేరిట మూడుసార్లు బాధితులను భారతదేశానికి నిందితులు రప్పించారు. వచ్చిన ప్రతిసారి సాకులు చెప్పి తిప్పి నిందితులు పంపించారు.
తాము మోసపోయమంటూ అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత్‌లో ఫిర్యాదు చేయాలని అమెరికా పోలీసులు చెప్పడంతో తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్ద మోసం కావడంతో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. పోలీసులు విచారణ చేపట్టి గతంలో తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ రాకెట్ అరాచకాలతో ఈ నిందితులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు... అప్పుల బాధలను ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ ముఠా అమాయకులను మోసం చేస్తుంది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు.
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు..
కాగా హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్(International kidney rocket) గుట్టు రట్టయ్యింది. కేరళకు(Kerala) చెందిన యువకుడి మృతితో ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక సూత్రధారి హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన వైద్యుడిగా గుర్తించారు. కొంతకాలంగా పేదలకు డబ్బు ఆశ చూపి విదేశాలకు తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేస్తూ దందా సాగిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న యువకుడు మృతిచెందడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
అసలేం జరిగిందంటే..
కేరళలో ఓ యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి ఈ మధ్యనే కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడని, అందుకు దళారులు రూ.20లక్షలు ఆశ చూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సబిన్(Sabin arrested) అనే దళారిని కోచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని విచారించారు. కీలక సూత్రధారులు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్, మరో ముగ్గురు కలిసి దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. యువకుడిని ఇరాన్ తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేశారని, రూ.20లక్షలు ఇస్తామని చెప్పి రూ.6లక్షలే ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినట్లు కేరళ పోలీసులు పేర్కొన్నారు.
బయటపడ్డ సంచలన విషయాలు..
దర్యాప్తులో భాగంగా కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్, కేరళకు చెందిన 40మంది యువకులను ఇరాన్ దేశం తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేయించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువమంది పేదలే ఉన్నట్లు వారు తెలిపారు. నగరానికి చెందిన ఒక వైద్యుడితోపాటు మరో ఇద్దరు దళారుల కోసం కేరళ పోలీసులు వెతుకుతున్నారు. కేరళలోని ఎర్నాకులం కేంద్రంగా వ్యవహారం నడుపుతున్నారని, పేదలను టార్గెట్ చేసుకుని నగదు ఆశ చూపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని కేరళ పోలీసులు పేర్కొన్నారు.
Also Read:
మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..
మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..
For More Telangana News and Telugu News..