BJP: శ్రీరామ చంద్రుణ్ణి అందరూ దర్శించుకోవచ్చు.. హనుమాన్ శోభాయాత్రలో కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Apr 23 , 2024 | 12:49 PM
Telangana: నగరంలోని గౌలిగూడ మందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అయితే శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిర్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజసింగ్, మాజీమంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రాం మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23: నగరంలోని గౌలిగూడ మందిర్ నుంచి శోభాయాత్ర (Hanuman Shobhayatra) ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అయితే శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిర్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy), ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh), మాజీమంత్రి ఈటెల రాజేందర్ (Etela Rajender) పాల్గొన్నారు.
Venkaiahnaidu: ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళను
అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రాం మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు. 550 ఏళ్ళ తర్వాత రాం మందిర్‌లో దివ్యమైన రాముణ్ణి ప్రతిష్టించుకున్నామని తెలిపారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది వైభవంగా హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర జరుగుతుందన్నారు. రాముడు దేశంలోని 140 కోట్ల మందికి దేవుడన్నారు. అందరూ శ్రీరామ చంద్రుణ్ణి దర్శించుకోవచ్చని వెల్లడించారు.
Viral: ఇంత నీచానికి ఎందుకు దిగజారుతారో? ఈమె 10వ తరగతి స్టేట్ ర్యాంకర్ అని తెలిసినా..
గ్రాండ్‌గా హనుమాన్ శోభాయాత్ర: రాజాసింగ్
ప్రతీసారి లాగే ఈసారి గ్రాండ్‌గా హనుమాన్ శోభాయాత్ర జరుగుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తనపై కావాలని పోలీసులు కేసులు పెట్టారని మండిపడ్డారు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా సుల్తాన్ బజార్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టారన్నారు. పోలీసులు శోభాయాత్రను లేట్ చేశారని.. తనకేమీ కేసులు కొత్తకాదన్నారు. దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నానని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
BJP leader: ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు..
AP Elections: రెండోసారి జగన్.. జనం రియాక్షన్ ఇదే..!
Read Latest Telangana News And Telugu News