Kishan Reddy: అదంతా డూప్ ఫైటింగ్.. ఎన్నికల వేళ కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
ABN , Publish Date - Feb 02 , 2024 | 06:19 PM
మాజీ సీఎం కేసీఆర్(KCR) మీద కోపంతో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌ది గెలుపు కాదు.. బీఆర్ఎస్ ఓటమి అని చెప్పారు.
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్(KCR) మీద కోపంతో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ గెలుపు కాదు.. బీఆర్ఎస్ ఓటమి అని చెప్పారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే పరిపాలనలో ఏదో మార్పు వస్తోందనుకోవడం లేదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేశారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేస్తామని చెప్పారని కిషన్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అవినీతిపై విచారణలేవి..?
బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ డూప్ ఫైటింగ్ చేస్తోందని.. ఆ పార్టీ అవినీతిపై విచారణ చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ రింగ్ చుట్టూ జరిగిన భూలావాదేవీల మీద విచారణ చేయాలని.. కానీ కాంగ్రెస్ విచారణ చేస్తోందని తాను అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తారన్నారు. తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాలు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువత, రైతులు, రైతు కూలీలు దేశం కోసం బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి అన్నారు.