Share News

KTR: వారి ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్..

ABN , Publish Date - Aug 18 , 2024 | 05:03 PM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) దుష్ట పాలన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా మండిపడ్డారు.

KTR: వారి ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) దుష్ట పాలన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా మండిపడ్డారు. రాష్ట్రం ప్రభుత్వం వేతనం చెల్లించకపోవడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఘటనకు సంబంధించిన సూసైడ్ నోట్, సహా బాధితుడి ఫొటోలను కేటీఆర్ ట్వీట్‌కు జోడించారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థంకాక వసీం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ప్రతినెలా ఒకటో తారీకునే జీతాలు చెల్లిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని, అది పచ్చి అబద్ధమని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ అని కేటీఆర్ రాసుకొచ్చారు. వసీం మృతికి ఇప్పుడు బాధ్యులు ఎవరంటూ ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్..

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..

Updated Date - Aug 18 , 2024 | 09:32 PM