Share News

KTR: సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: కేటీఆర్

ABN , Publish Date - Jul 17 , 2024 | 03:07 PM

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ని బద్నాం చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాల్లో అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి(Narasimha Reddy)ని మార్చాలన్న ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

KTR: సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: కేటీఆర్

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ని బద్నాం చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాల్లో అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి(Narasimha Reddy)ని మార్చాలన్న ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతీకార, కక్ష సాధింపులకు ఓ పరిమితి ఉంటుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై దుష్ర్పచారాలు చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలోనూ సరైన గుణపాఠం ఖాయమని కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఒప్పందాలన్నీ సక్రమంగానే ఉన్నా ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షసాధింపులకు సీఎం రేవంత్ రెడ్డి తెరతీశారని ధ్వజమెత్తారు.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజకీయ కక్షసాధింపుపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ మీద దుష్ప్రచారాలు చేయడంలో ఆ పార్టీ నేతలు పరిమితులు దాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడవని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు స్పష్టం చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.


విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మమ్మల్ని బద్నాం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి ఉన్నత న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు.


మరోవైపు బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌కు సైతం ఉన్నత న్యాయస్థానం తీర్పుపై స్పందించారు. విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డిని తప్పించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో నరసింహారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, విచారణకు వేసిన అన్ని కమిషన్లు రాజకీయ బూటకపు కమిషన్లే అని ఎద్దేవా చేశారు.


బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయ్యిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తాము సీరియస్‌గా తీసుకోమని క్రిశాంక్ చెప్పారు. ఓవైసీకి కేసీఆర్ జవాబుదారీ కాదన్నారు. మేము బీజేపీతో ములాఖత్ అయితే ఎమ్మెల్సీ కవిత జైలుకు ఎందుకు వెళ్తారని ఆయన ఒవైసీని ప్రశ్నించారు. కవిత అరెస్టును ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఖండించాయని క్రిశాంక్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Harish Rao: ఆ ఎమ్మెల్యేలను మాజీలను చేసేవరకు నిద్రపోం..

CM Revanth: కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతిపై సీఎం రేవంత్ స్పందన

Updated Date - Jul 17 , 2024 | 03:59 PM