KTR: జాబ్ క్యాలెండర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Aug 02 , 2024 | 07:44 PM
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్(Job Calendar) బోగస్ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీ మేరకు ప్రశ్నిస్తారనే భయంతో రెండు పేపర్ల మీద ఏదో రాసుకొచ్చి ఇదే జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోలను మభ్యపెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్: రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్(Job Calendar) బోగస్ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీ మేరకు ప్రశ్నిస్తారనే భయంతో రెండు పేపర్ల మీద ఏదో రాసుకొచ్చి ఇదే జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోలను మభ్యపెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరితే ఇవ్వలేదని అన్నారు. మేం ప్రశ్నిస్తామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ నుంచి పారిపోయిందని ఎద్దేవా చేశారు.
గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి దమ్ముంటే హైదరాబాద్ అశోక్ నగర్ రావాలని, తాము కూడా వస్తామంటూ సవాల్ విసిరారు. ఒక్క ఉద్యోగమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని నిరుద్యోగులు చెప్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. మార్పు మార్పు అంటూ యువతను ఏమార్చారన్నారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అని అందులో ఉద్యోగాలే లేవన్నారు. శాసనసభకు ఇవాళ(శుక్రవారం) చీకటి రోజు అని కేటీఆర్ అన్నారు.
Drugs Case: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు..
అనర్హతవేటు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు స్పీకర్ మైక్ ఇచ్చి గౌరవ శాసనసభను కౌరవ సభగా మార్చారని కేటీఆర్ మండిపడ్డారు. శాసనసభ సభ్యులు ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారని, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలూ చిల్లర, బజారు భాష మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సభ్యుడు మమ్మల్ని అమ్మ, అక్క అని తిడుతుంటే శాడిస్ట్ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందారని, రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్ అని అన్నారు. మమ్మల్ని బజారు భాషలో తిట్టించిన దిగజారుడు ముఖ్యమంత్రి, దివాలాకోరు ప్రభుత్వాన్ని తెలంగాణ యువత తిరస్కరించాలన్నారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహించారు.
అయితే జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య వెల్లడించలేదంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులకు గన్ పార్క్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఖాళీ చేయకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తరలిస్తున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ వార్త కూడా చదవండి:
TG News: రష్యాలో వరంగల్ జిల్లా కలంకారీ దరీస్‌కి అరుదైన అవకాశం..