Share News

Lal Darwaza Bonalu: ఢిల్లీలో ఘనంగా లాల్ దర్వాజ్ బోనాలు

ABN , Publish Date - Jul 09 , 2024 | 10:10 PM

ల్లీలో ఘనంగా లాల్ దర్వాజ్ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు (Lal Darwaza Bonalu) ఈరోజు (మంగళవారం) ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో 10 ఏళ్లుగా మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి.

Lal Darwaza Bonalu: ఢిల్లీలో ఘనంగా లాల్ దర్వాజ్ బోనాలు
Lal Darwaza Bonalu

ఢిల్లీ: ఢిల్లీలో ఘనంగా లాల్ దర్వాజ్ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు (Lal Darwaza Bonalu) ఈరోజు (మంగళవారం) ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో 10 ఏళ్లుగా మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటాలను ఊరేగించారు. ఘటాల ఊరేగింపును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు.

అనంతరం తెలంగాణ భవన్‌లో ఘటస్థాపన గావించారు. రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వేడుకల్లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.


బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుమారు 150 మంది సాంస్కృతిక కళాకారులతో తెలంగాణ సంస్కృతికి సంబంధించిన కళారూపాలను ప్రదర్శించనున్నారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో బోనాల పండుగ ముగియనున్నాయి.

Updated Date - Jul 09 , 2024 | 10:37 PM