Share News

Madhavi Latha: పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మాధవిలత గట్టి కౌంటర్

ABN , Publish Date - Sep 23 , 2024 | 10:27 PM

వేంకటేశ్వరుని ప్రసాదాన్ని కల్తీ చేయడం మహా పాపమని బీజేపీ నాయకురాలు మాధవిలత అన్నారు. ధర్మాన్ని తాను పాటిస్తూ శ్రీవారి నామస్మరణ చేస్తూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకుంటానని చెప్పారు. ఈనెల 26 వరకు తిరుమలకు చేరుకుంటానని అన్నారు. అలిపిరి నుంచి కొండపైకి కాలినడకన వెళ్లి తన వినతిపత్రాన్ని శ్రీవారికి అందజేస్తానని మాధవిలత పేర్కొన్నారు.

Madhavi Latha: పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మాధవిలత గట్టి కౌంటర్

రంగారెడ్డి జిల్లా. (చేవెళ్ల): ఏపీ ప్రభుత్వం మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నాయకురాలు మాధవిలత గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన కారణజన్ముడై ఉంటారని.. ఆయనకు ఇచ్చేది తాను ఒకటే సమాధానమని అన్నారు. చిటికెడు విషాన్ని ఒక కుండ పాలల్లో వేసిన అది పూర్తిగా మలినం అయిపోయినట్టు చిటికెడు పంది కొవ్వు వేసిన అది పాపమే అవుతుందని మండిపడ్డారు.


తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై సమగ్ర విచారణ జరిపించాలని మాధవిలత డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలోని శ్రీ చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ఇవాళ(సోమవారం) దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ... వేంకటేశ్వరుని ప్రసాదాన్ని కల్తీ చేయడం మహా పాపమని అన్నారు. ధర్మాన్ని తాను పాటిస్తూ శ్రీవారి నామస్మరణ చేస్తూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకుంటానని చెప్పారు. ఈనెల 26 వరకు తిరుమలకు చేరుకుంటానని అన్నారు. అలిపిరి నుంచి కొండపైకి కాలినడకన వెళ్లి తన వినతిపత్రాన్ని శ్రీవారికీ అందజేస్తానని మాధవిలత పేర్కొన్నారు.


పొన్నవోలు ఏమన్నారంటే...

తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో పందికొవ్వు కలిపారని చెప్పడం హస్యాస్పదమని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలకు సరఫరా చేసే నెయ్యి ఖరీదు కిలో రూ.320 కాగా.. అందులో రూ.1400 విలువచేసే పంది కొవ్వును ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మార్కెట్‌లో పందికొవ్వు ధర రూ.400 నుంచి రూ.1400 ఉందని చెప్పారు. నెయ్యి కంటే ఖరీదైన వస్తువుతో కల్తీ ఎలా చేస్తారన్నారు. రాగితో బంగారంలో కల్తీ చేయవచ్చని, బంగారంతో రాగిని కల్తీ చేస్తారా అంటూ ప్రశ్నించారు.

Updated Date - Sep 23 , 2024 | 10:27 PM