Share News

Bhatti Vikramarka: దోచుకున్న సొమ్మును కేసీఆర్ కుటుంబ సభ్యులు విదేశాల్లో దాచుకున్నారు

ABN , Publish Date - Aug 31 , 2024 | 09:49 PM

సింగరేణిని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భ్రష్టు పట్టించారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారు.పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగా సభ ఈరోజు(శనివారం) జరిగింది. ఈ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ...కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు.

Bhatti Vikramarka: దోచుకున్న సొమ్మును కేసీఆర్ కుటుంబ సభ్యులు విదేశాల్లో దాచుకున్నారు

పెద్దపల్లి: సింగరేణిని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భ్రష్టు పట్టించారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారు.పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగా సభ ఈరోజు(శనివారం) జరిగింది. ఈ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ...కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. పదేళ్లు ఏం పాలన చేశావని అడిగితే తమ ప్రభుత్వంపై విమర్శలకు దిగడమే కానీ .. కేసీఆర్ ఏం చేశారో చెప్పడం లేదని అన్నారు. తమ ప్రభుత్వాన్ని అడగటానికి ఆయనకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము అంతా కేసీఆర్ కుటుంబ సభ్యులు విదేశాల్లో దాచుకున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతోందని స్పష్టం చేశారు.


హామీల అమల్లో కేసీఆర్ విఫలం: చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు(శనివారం) గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడిగా హాజరై ప్రజల తరుపున పోరాడాలని ఆహ్వానించామని తెలిపారు.కేసీఆర్ ప్రజల సమస్యల మీద ఇన్ని రోజులు అంటి ముట్టనట్లు ఎందుకు ఉన్నారు ? అని ప్రశ్నించారు. వచ్చే ముందు కేసిఆర్ ఇచ్చిన 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో‎లో ఏం పెట్టారు.. ఏం చేశారు.. తాము ఏం చెప్పాం ఏం చేశామో చర్చ పెడదామని సవాల్ విసిరారు. దళిత సీఎం నుంచి.. దళితలకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎది అమలు చేయలేదని మండిపడ్డారు.


ఎవరు ఏం చేశారో యాదాద్రి వేదికగా చర్చ పెడదామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి బీజేపీ మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం మీద పోరాటం కలసి చేయాలని పిలుపునిచ్చారు. విభజన హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్ని సార్లు కలిసిన మొండి చేయి చూపారని మండిపడ్డారు. మిషన్ కాకతీయ కాదు కమిషన్ కాకతీయ రూపకర్త మాజీ మంత్రి హరీష్ రావు చెరువులను కాపాడుతుంటే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.


33 జిల్లాల్లో రూ. 10 వేల కోట్లతో నిధులు కేటాయించింది కమిషన్ తీసుకొనే కదా అని ఆరోపించారు.. అందుకే ఆ పనులను తొలగించామని తేల్చిచెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గేకి బుల్డోజర్ ప్రభుత్వం అని ట్వీట్ (ఎక్స్ )చేస్తున్నారని అన్నారు. ఒక మున్సిపల్ మంత్రిగా పని చేసిన వ్యక్తి ఇల్లీగల్ నిర్మాణం అని తెలుసు కూడా లీజ్‎కు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నారని అన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన విద్య సంస్థల కూల్చివేతకు సెలవుల వరకు వేచి చూస్తాం అని చెప్పారు. అపోజిషన్ అంటేనే X వేదికగా ట్వీట్ చేయడం అయిపోయిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Updated Date - Aug 31 , 2024 | 10:05 PM