Share News

Congress: ఖర్గేతో ముగిసిన టీ కాంగ్రెస్ నేతల భేటీ.. ఏం చర్చించారంటే..?

ABN , Publish Date - Jan 11 , 2024 | 06:46 PM

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ( Congress ) గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పలు విషయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు.

Congress: ఖర్గేతో ముగిసిన టీ కాంగ్రెస్ నేతల భేటీ.. ఏం చర్చించారంటే..?

ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ( Congress ) గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పలు విషయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) మీడియాకు వివరించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రచారం ఎలా ఉండాలి, పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకం అవ్వడంపై ఖర్గే మార్గానిర్ధేశం చేశారన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 కి 17 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. రెండు, మూడు స్థానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని చెప్పారు. 17 కి 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారెంటీలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించాం: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని మొదట చెప్పింది తానేనని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (
Minister Uttam Kumar Reddy ) తెలిపారు. నల్లగొండ జిల్లా పార్లమెంటు సీటును 3 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపారు. 14 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచు కుంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు.

Updated Date - Jan 11 , 2024 | 06:46 PM