Share News

Red Alert: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ..

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:38 PM

బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్(Red Alert) జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఇవాళ(శనివారం) ఉదయం వాయగుండంగా మారింది.

Red Alert: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ..

హైదరాబాద్: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఇవాళ(శనివారం) ఉదయం వాయగుండంగా మారింది. దీంతో ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలోనే వాయుగుండం కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం, విశాఖపట్నం, గోపాల్ పూర్ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది.


ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట సహా పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వానలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం తీరే దాటే సమయంలో తెలంగాణలో గంటకు 30నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి:

HYDRA: బీజేపీ కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ఉద్రిక్త వాతావరణం..

TG Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ..

Road Accident: బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం..

Updated Date - Aug 31 , 2024 | 01:43 PM