Minister Jupalli: సాదుల రాములును బీఆర్ఎస్ నేతలు పగతో హత్యచేశారు
ABN , Publish Date - Jan 02 , 2024 | 10:15 PM
బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులు కాంగ్రెస్ ( Congress ) నేత సాదుల రాములుతో తీవ్ర ఘర్షణకు దిగారని.. ఈఘర్షణలో రాములుని కక్షతో హత్యచేశారని రాష్ట్ర ఎక్సైజ్ & టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లాలోని నసూర్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూఇయర్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్: బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులు కాంగ్రెస్ ( Congress ) నేత సాదుల రాములుతో తీవ్ర ఘర్షణకు దిగారని.. ఈఘర్షణలో రాములుని కక్షతో హత్యచేశారని రాష్ట్ర ఎక్సైజ్ & టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లాలోని నసూర్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూఇయర్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో సాదుల రాములు సర్పంచ్‌గా ఓడినా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సర్పంచ్‌గా గెలుస్తాడనే కారణంతో పగ పెచ్చుకుని హతమార్చారని చెప్పారు. ఇసుక మాఫియా నడిపే బీఆర్ఎస్ నేత సుధీర్ హత్యచేశాడని ఆరోపించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సాదుల రాములు కుటుంబాన్ని పరామర్శించామని తెలిపారు. కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సాదుల రాములుని హత్య చేసిన వారిని చట్టం పరంగా శిక్షిస్తామని హెచ్చరించారు.బీఆర్ఎస్ నాయకులారా ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. ఇసుక మాఫియా మంజీరాలో ఎంత లోతు తవ్వరనే దానిపై జిల్లా మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వం సొమ్మును ముక్కు పిండి వసులు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.