Minister Komati Reddy: పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్‌తో అభివృద్ధి పనులు ఆగిపోయాయి
ABN , Publish Date - Feb 01 , 2024 | 10:05 PM
పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్‌తో అభివృద్ధి పనులు ఆగిపోయాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో గురువారం నాడు మంత్రి కోమటిరెడ్డి సమావేశం అయ్యారు.
ఢిల్లీ: పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్‌తో అభివృద్ధి పనులు ఆగిపోయాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో గురువారం నాడు మంత్రి కోమటిరెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన విషయాలను మీడియాకు మంత్రి కోమటిరెడ్డి వివరించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ తరపున కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. రాష్ట్ర అంశాలపై నితిన్ గడ్కరీ రెండు గంటల పాటు రివ్యూ చేశారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించకపోవడంతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు ప్రారంభమై ఆగిపోయినట్లు వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు అనౌన్స్ చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదని తెలిపారు.
హైదరాబాద్, విజయవాడ హైవేకు సంబంధించి ఎంపీగా ఉన్న సమయంలో కూడా కేంద్రాన్ని అడిగానని అన్నారు. ఫిబ్రవరి చివరి నాటి వరకు రాష్ట్రంలో ఆగిపోయిన పనులను వెంటనే పరిష్కరిస్తానని గడ్కారీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్ఓబీల వద్ద పనుల కోసం రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారన్నారు. ఈ యాన్వల్ ప్లాన్‌లో నల్లగొండ బైపాస్‌కు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉప్పల్, ఘట్‌కేసర్ రహదారులను గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్ల పనులు జరగలేదని చెప్పారు. RRRకు ఫాస్ట్రాక్‌లో టెండర్లు పిలవమని చెప్పారని అన్నారు. తెలంగాణకు సహకరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. అన్ని రోడ్లను హైవేలుగా మారుస్తామని చెప్పారన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణకు రావాలని గడ్కరీని కోరామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌లు ఏం మాట్లాడినా తాము పట్టించుకోమన్నారు. అన్ని జిల్లాల్లో స్కిల్ డ్రైవింగ్ సెంటర్లు పెట్టాలని కేంద్రాన్ని కోరామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.