Minister Komati Reddy: ప్రతిపక్ష నేత ఎందుకు సభకు రావడం లేదు
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:35 AM
మాజీ మంత్రి హరీష్‌రావుపై మంత్రి మటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(గురువారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో విపక్షాల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించొదని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశించారు. వెల్‌లోకి రావడం, నినాదాలు చేయడం సరికాదని స్పీకర్ సూచించారు. మనం పెట్టుకున్న రూల్స్ మనమే ఉల్లంఘించడం సరికాదని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.
హరీష్‌రావు ఏ హోదాలో అడుగుతున్నారు: మంత్రి కోమటిరెడ్డి
సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. క్వశ్చన్ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నోత్తరాల్లో మాట్లాడటంపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. హరీష్‌రావు ఏ హోదాలో అడుగుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావు అందరిలాగే ఎమ్మెల్యే అని.. ఎల్వోపీ లీడర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. హరీష్ రావు ఎల్వోపి కాదు.. డిప్యూటీ లీడర్ కూడా కాదని చెప్పారు. ఆయనకు పదే పదే మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. హరీశ్‌రావు ఏ హోదాలో మాట్లాడుతున్నారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీశారు.
యుద్ధ ప్రాతిపదికన SLBC పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అన్ని ప్రాజెక్టులు పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రెండేళ్లలో SLBC టన్నెల్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. స్టేషన్‌ఘన్‌పూర్ కాల్వకు రూ.120 కోట్లు, త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు రూ.37 కోట్లు కావాల్సి ఉందని.. ఈవారంలోనే రూ.22 కోట్లు విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. SLBC టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ బిల్లులపై చర్చ..
అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి మొదట గంట సేపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం భూ భారతి (ఆర్ఓఆర్) 2024 బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లు సభలో ఆమోదం పొందుతుంది. అలాగే ఈ రోజు మరో మూడు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది తెలంగాణ మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు.., జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఈ రెండు అంశాలపై సభలో లఘు చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శాసనసభకు (Assembly) గంట ముందుగానే వచ్చారు. గురువారం భూ భారతి, రైతు బరోసా తదితర అంశాలపై సభలో చర్చ ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలు, అధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Revanth Reddy: అదానీకి ప్రధాని అండ
AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్.. హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు తర్వాత చర్యలు
Hyderabad: అనుమతి నుంచి రెన్యూవల్ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే..
Read Latest Telangana News and Telugu News