Share News

Minister Sridhar Babu: ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథస్సుకు ప్రాధాన్యం ఉంది.... మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 09:40 PM

ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథస్సుకు ప్రాధాన్యత ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్‎పై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఏఐ ఉండాలి హైదరాబాద్ Ai క్యాపిటల్‎గా ఎదగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Minister Sridhar Babu: ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథస్సుకు ప్రాధాన్యం ఉంది.... మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Minister Sridhar Babu

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథస్సుకు ప్రాధాన్యత ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్‎పై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఏఐ ఉండాలి హైదరాబాద్ ఏఐ క్యాపిటల్‎గా ఎదగాలని అన్నారు. స్టార్టప్ ఇన్నోవేషన్‎తో ప్రతి ఒక్కరూ వచ్చారని వివరించారు. రెండు రోజుల పాటు హెచ్ఐసీసీలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ జరగనుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


ALSO Read: Uttam kuamr: మరమ్మతులు, పునరుద్ధరణకు టెండర్లను పిలవండి.. మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ఏఐ వినియోగంపై ఎథికల్ నాన్ ఎథికల్ అంశాలపై సదస్సులో చర్చ జరుగుతుందని చెప్పారు. తాము ఏర్పాటు చేయబోయే ఏఐ సిటీకి ఇప్పుడు జరిగే సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని వివరించారు. మానవాలికి ఉపయగపడే విధంగా ఏఐ టెక్నాలజీ ఉండాలని సూచించారు. విద్య , వైద్యం వ్యవసాయ ప్రభుత్వ రంగాల్లో ఏఐని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఏఐని వాడుకుంటూ మంచి సర్వీస్ ప్రజలకు ఇవ్వబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.


ALSO Read: Mobile Recovery: మీ ఫోన్ పోయిందా?.. రికవరీ అయిన మొబైల్స్‌లో ఒకటి మీదేనా?

ప్రపంచంలో గాల్లో ఎగిరే కార్లు సైతం భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే ఎన్నో సంస్థలు తెలంగాణకు రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని కొంతమంది అంటున్నారని .. మరి కొంత మంది ఉద్యోగాలు వస్తాయని అంటున్నారని చెప్పారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనే భయం మాత్రం ఉందని అన్నారు. ఏఐ టెక్నాలజీ వచ్చాక కొత్త ఉద్యోగాల కల్పన ఎలా చేయాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Harish Rao: విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాలి

Vijayawada Floods: బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

Ranganath: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 09:46 PM