Share News

Minister Ponguleti: సెటైర్లు బంద్ చెయ్.. కేటీఆర్‌పై పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:49 AM

అనుభవం లేకనే తప్పులు మీద తప్పులు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ బురద జల్లడం మానుకోవాలని మంత్రి పొంగులేటి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంచి పాలనా దక్షిత ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.

Minister Ponguleti: సెటైర్లు బంద్ చెయ్.. కేటీఆర్‌పై పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు..
Minister Ponguleti Srinivasa Reddy

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు మానేసి మంచి సలహాలు ఇవ్వాలని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై అదే పనిగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ (KTR)పై మంత్రి మండిపడ్డారు. రైతు బంధు, ప్రభుత్వ ఉద్యోగాలు, హైడ్రా, మూసీ నిర్వాసితుల విషయంలో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పొంగులేటి ధ్వజమెత్తారు.


అనుభవం లేకనే తప్పులు మీద తప్పులు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డికి మంచి పాలనా దక్షిత ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్‌కు ఏం అనుభవం ఉందో చెప్పాలని కేటీఆర్‌ను మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ఏం అనుభవం ఉందని ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.


ఏం అనుభవం ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురపాలకశాఖ మంత్రిగా పని చేశావో చెప్పాలని కేటీఆర్‌కి సూచి ప్రశ్న వేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు కూడా అనుభవం ఉండే మంత్రిగా చక్రం తిప్పారా అంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు సేవ, మంచి చేయాలనే తపన ఉండాలని తప్పు అనుభవంతో పని లేదని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతో ఉందని, తమపై ఇకనైనా తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని కేటీఆర్‌కు మంత్రి హితవు పలికారు. ఎవరైన్ని ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలు వారి మాటలు నమ్మరని మంత్రి పొంగులేటి అన్నారు.


ప్రస్తుతం మంత్రి పొంగులేటి సహా పలువురు మంత్రులు, అధికారుల బృందం దక్షిణ కొరియా దేశంలో పర్యటిస్తోంది. ఇవాళ(సోమవారం) ఆ దేశ రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారులు పర్యటించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే MAPO రిసోర్స్ రికవరీ ప్లాంట్‌, చియంగ్ చు నదిని సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం సియోల్‌లో యాన్, చియంగ్ చూ నదుల అభివృద్ధి ప్రాజెక్టులను మంత్రులు, అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

CM Revanth: వాటిపై దాడి చేస్తే వదలిపెట్టం.. సీఎం మాస్ వార్నింగ్

Group-1 Exams: గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 21 , 2024 | 12:28 PM