Minister Thummala ప్రభుత్వాల తలరాత మార్చేది వారే.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 03 , 2024 | 07:36 PM
మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ప్రజలు ప్రభుత్వ అధికారులను గుర్తు పెట్టుకుంటారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ అదికారులది కీలక పాత్ర అని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
ఖమ్మం: ప్రభుత్వాల తలరాత మార్చే శక్తి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు మాత్రమే ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఇవాళ(ఆదివారం) సకల ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆశించినట్లే ప్రజా పాలనలో వారి సమస్యలు క్షేత్ర స్థాయిలో ఉద్యోగులకు తెలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి కానీ ఉద్యోగులు 30 ఏళ్ల వరకు విధుల్లో ఉంటారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపేర్కొన్నారు.
ప్రభుత్వ అదికారులది కీలక పాత్ర ..
మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ప్రజలు ప్రభుత్వ అధికారులను గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ అదికారులది కీలక పాత్ర అని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారిస్తారని.. కానీ కాస్త సమయం కావాలని అన్నారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాందీ వాగ్దానాలు అమలు చేయడంలో ప్రభుత్వానికి ఉద్యోగులు అండగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు వన సమారాధనలో పాల్గొన్నారని.. వారికి పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వ ఉద్యోగులు సహకారం మరువలేనిదని అన్నారు. తన హయాంలో పని చేసిన అధికారులు ఎంతో మంది దేశ స్థాయిలో ఉన్నత స్థితికి చేరారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశా: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం: ఏ ప్రభుత్వంలో ఉన్నా తాను ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... గత 40 ఏళ్లుగా ఇల్లందు నియోజకవర్గంతో తనకు అనుబంధం ఉందని తెలిపారు. ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఎర్ర బస్సు, కరెంట్ బల్బు చూడని గుండాల ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులకు ప్రగతి బాట పట్టించానని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
రూ. 2 లక్షల పైన రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. భద్రాచలం శ్రీ రామచంద్రుడు సాక్షిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన రుణమాఫీ వాగ్దానం నెరవేర్చామని అన్నారు. అధిక వర్షాల వల్ల పత్తి దిగుబడులు తగ్గాయని.. గిట్టుబాటు ధర వచ్చేలా సీసీఐ ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టిందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాలు వస్తాయని అన్నారు. పత్తి సాగుతో నష్టపోకుండా ఆయిల్ పామ్ సాగు ఇల్లందు నియోజక వర్గంలో చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG Politics : రైతులను రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్
TG Politics: ‘దౌర్భాగ్య స్థితిలో రేవంత్ సర్కార్’
Minister Jupally: అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది..
For Telangana News And Telugu News