Thummala: గాంధీభవన్‌లో ముఖాముఖి.. పాల్గొన్న మంత్రి తుమ్మల
ABN , Publish Date - Oct 07 , 2024 | 03:27 PM
Telangana: తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి అర్జీలు పెట్టారు. మొత్తం 95 అర్జీలను మంత్రి తుమ్మల స్వీకరించారు. భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్స్, ఇందిరమ్మ ఇల్లు, పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందాయి.
హైదరాబాద్, అక్టోబర్ 7: గాంధీభవన్‌లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నేరేడు చర్ల మండలానికి సంబంధించిన భూమి విషయంలో యాదమ్మ అనే వృద్ధ మహిళ మంత్రికి ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన తుమ్మల.. సూర్యాపేట కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని సూచించారు.
TDP- BRS: టీడీపీ గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు.. ఎవరంటే..
మరోవైపు ముఖాముఖి కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి అర్జీలు పెట్టారు. మొత్తం 95 అర్జీలను మంత్రి తుమ్మల స్వీకరించారు. భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్స్, ఇందిరమ్మ ఇల్లు, పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందాయి. కొన్ని సమస్యలపై వెంటనే కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
రుణమాఫీ కనిపించడం లేదా..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీభవన్‌కు వస్తే తమ సమస్యలు తీరతాయని ప్రజలు వస్తున్నారని తెలిపారు. ‘‘మేం నిత్యం రైతుల్లోనే తిరుగుతున్నాం.. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే మాకు నిరసన సెగ తాకేది కదా. తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే చూపించాలి.. అధికారం కోల్పోయిన బాధ ఒకరిది.. అధికారంలోకి రావాలనే బాధ ఇంకొకరిది.. తెలంగాణ రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? 18 వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి కనిపించడం లేదా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసారా? రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తాం అని స్పష్టం చేశారు.
BRS: బంగారు తెలంగాణ నుంచి బెదిరింపుల వరకు.. హన్మంతరావు వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ మండిపాటు
టీపీపీసీ చీఫ్‌పై...
పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళతామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ కావాలనే ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ రుణమాఫీలో ప్రపంచాన్ని మోసం చేసిందన్నారు. ఇప్పటికీ 22 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశామని.. ఇంకా 20 లక్షల మంది రైతులకు మాఫీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Ponnam: ప్రతీ ఒక్కరు బీసీ సంక్షేమ గౌరవాన్ని కాపాడాలి
Jani Master: రెగ్యులర్ బెయిల్ కోసం జానీమాస్టర్ పిటిషన్
Read Latest Telangana News And Telugu News