Minister Uttam: అభిషేక్ సింఘ్వీతో తెలంగాణకు న్యాయం
ABN , Publish Date - Aug 19 , 2024 | 11:02 AM
ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈరోజు(సోమవారం) రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ అసెంబ్లీలో కాసేపటి క్రితమే నామినేషన్ వేశారు. సింఘ్వీ నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈరోజు(సోమవారం) రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ అసెంబ్లీలో కాసేపటి క్రితమే నామినేషన్ వేశారు. సింఘ్వీ నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అభిషేక్ సింఘ్వీ మను స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబం నుంచి వచ్చారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వీ మను వెళ్లడం వల్ల రాష్ట్రానికి అన్ని విధాలా న్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు. సింఘ్వీ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరారు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలు తీసుకు వచ్చిందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు రుణాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు రుణాలు ఇచ్చిందని గుర్తుచేశారు. మహిళల రక్షణ విషయంలోనూ తమ ప్రభుత్వం హై ప్రీయారిటీ ఇస్తుందని చెప్పారు.