Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:13 PM
Telangana: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే మాట్లాడుతూ... హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు టికెట్స్ దొరకకపోవడం దారుణమన్నారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందన్నారు. వేలాది టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 5: ఐపీఎల్ (IPL) టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే మాట్లాడుతూ... హైదరాబాద్‌లో (Hyderabad) జరిగే మ్యాచ్‌లకు టికెట్స్ దొరకకపోవడం దారుణమన్నారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందన్నారు. వేలాది టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. బ్లాక్ మార్కెట్ దందాపై ముఖ్యమంత్రి, స్పోర్ట్స్ మినిస్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
Congress: ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వరాలు..
అంతా చేసింది హెచ్‌సీఏనే...
తాను డీఎన్‌ఆర్ అకాడమీని నడుపుతున్నానని.. బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో టికెట్స్ దొరకకపోవడానికి ప్రధాన కారణం హెచ్‌సీఏ అని ఆరోపించారు. హెచ్‌సీఏ కాంప్లమెంటరీ పాస్ బ్లాక్‌లో అమ్ముతోందన్నారు. హెచ్‌సీఏ తీరుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ క్రీడా కారుడు ఉండేలా చూడాలన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ క్రీడాకారులు లేకపోవడం దారుణమన్నారు. కిరణ్, సన్ రైజర్స్ ఫ్రాంచజీ మొత్తంపై చర్యలు తీసుకోవాలన్నారు. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు. టికెట్స్ అమ్మకాలు పారదర్శకంగా జరగాలని సూచించారు. వచ్చే మ్యాచ్‌లలో బ్లాక్ టికెట్స్ దందా జరగకుండా చూడాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
KCR: కేసీఆర్ పొలం బాట.. కరీంనగర్‌కు పయనం..
Andhra Pradesh: వైసీపీ ముఖ్య నేతకు బీజేపీ లీడర్ సీరియస్ వార్నింగ్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...