Share News

Rakesh Reddy: నిరుద్యోగులపై రేవంత్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:18 PM

నిరుద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు.

Rakesh Reddy: నిరుద్యోగులపై రేవంత్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి
Rakesh Reddy

హైదరాబాద్: నిరుద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. రేవంత్ ఏ పరీక్ష రాశారని నిరుద్యోగుల గురించి మాట్లాడారని ప్రశ్నించారు. నీట్ గురించి మాట్లాడిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పరీక్ష రాశారా? అని నిలదీశారు.


ఈ వార్త కూడా చదవండి: అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు పచ్చజెండా

నిరుద్యోగులను అవహేళన చేసేలా కాంగ్రెస్ నేతలు అవివేకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ కచ్చితంగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు కవాతు చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కి ప్రజలు వారి సమస్యలపై కొట్లాడే బాధ్యతను ఇచ్చారని రాకేష్‌రెడ్డి తెలిపారు.


కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం మాట్లాడితే ఉద్యమం.. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడితే కుట్రనా...? అని ప్రశ్నించారు. డీఎస్సీని వాయిదా వేయాలని అభ్యర్థులు కోరితే కాంగ్రెస్ నేతలు అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారని రాకేష్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు

Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

Anitha: ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

Harish Rao:రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Rakesh Reddy: నిరుద్యోగులపై రేవంత్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 03:42 PM